ETV Bharat / city

రాజధానిని మారిస్తే కథ అంతా మొదటికొస్తుంది..! - Amaravathi Issue

పరిపాలన సాగించేందుకు కొన్ని భవనాలు, వాటికి రహదారులు ఉంటే సరిపోతాయి కదా..! మరెందుకు ఇన్ని వేల ఎకరాలను సేకరించారు..? వాటిని ఏం చేసుకుంటారు..? ఇంత పెద్దమొత్తంలో నిర్మాణాలకు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు..?. అమరావతి నిర్మాణంపై కొన్ని రోజులుగా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రాజధాని అంటే ఒక చిన్న ప్రాంతానికి పరిమితమా..? కానే కాదు... ఒక చక్కటి పరిపాలనా కేంద్రం ఔత్సాహికులను, ఆర్థిక, విద్య, వైద్య సంస్థలను ఆకర్షిస్తుంది. ప్రజలందరి ఆశలకు రెక్కలు తొడుగుతుంది. ప్రగతి వెలుగులను నలుదిశలకు పంచుతుంది. అదీ రాజధాని అంటే..!

Educational institutions in Amaravathi
రాజధానిని మారిస్తే కథ అంతా మొదటికొస్తుంది..!
author img

By

Published : Jan 12, 2020, 8:28 AM IST

రాజధానిని మారిస్తే కథ అంతా మొదటికొస్తుంది..!

అమరావతిని రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు, ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారీ కసరత్తు జరిగింది. కోర్‌ కేపిటల్‌ నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తూ... మిగిలిన నగర నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించింది. ఫలితంగా భారీగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వేల కోట్ల విలువైన ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. వాటిని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున భూ కేటాయింపులు జరిగాయి. పక్కా కార్యాచరణ అమలవుతున్న కీలక సమయంలో రాజధానిని మారిస్తే కథ అంతా మొదటికొస్తుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు వెళ్లిపోయాయి. మరికొన్ని పునరాలోచనలో పడ్డాయి. ఇప్పుడు వాటికి భరోసా ఎవరిస్తారు..?’ అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు, కార్యాలయాల నిర్మాణాలకు ముందుకొచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వాటి ప్రస్తుత ఎలా ఉందో చూద్దాం.

అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1660 ఎకరాల భూ కేటాయింపులకు అనుమతిచ్చింది. నికరంగా 130 సంస్థలకు 1293 ఎకరాలను సీఆర్‌డీఏ కేటాయించింది. వాటిలో కొన్ని ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని పనుల ప్రారంభానికి సన్నద్ధం అవుతున్నాయి. అవన్నీ ఆచరణలోకి వస్తే రూ.44,300 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కొన్ని సంస్థలకు పూర్తి హక్కులతో భూముల విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ సంస్థలకు 30 నుంచి 99 ఏళ్ల వరకు లీజు ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులతో సీఆర్‌డీఏకి రూ.677 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంకా రావలసిన బకాయిలు 546 కోట్లు ఉన్నాయి.

విద్యారంగానికి సంబంధించి విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యాలయాలకు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థకు భూముల కేటాయింపు జరిగింది. వాటిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎంలు తొలిదశ నిర్మాణాలు పూర్తిచేసి, రెండేళ్ల నుంచి తరగతులు నిర్వహిస్తున్నాయి. అమృత యూనివర్సిటీ నిర్మాణ దశలో ఉంది. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐకి శంకుస్థాపన జరిగింది. విట్‌కి మొత్తం 200 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. తొలి దశలో 100 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. మొత్తం రెండు దశల్లోనూ కలిపి రూ.3,750 కోట్లు పెట్టుబడి పెడతామని, 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదించింది. 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని, 50 వేల మంది విద్యార్థులను చేర్చుకుంటామంది.

అమృత సంస్థకు తొలి దశలో 150 ఎకరాలు, రెండో దశలో 50 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. మొత్తం పెట్టుబడి రూ.4000 కోట్లు. 52 వేల మంది విద్యార్థుల్ని చేర్చుకుంటామని, 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థ గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ)కు 50 ఎకరాలు కేటాయించింది. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

పొద్దార్‌, ర్యాన్‌, గ్లెన్‌డేల్‌ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే పాఠశాలలకూ భూముల కేటాయింపు జరిగింది. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి తొలి దశలో 100 ఎకరాలు కేటాయించింది. రెండో దశలో మరో 100 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. మొత్తంగా కోటి చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తామని, రూ.3,300 కోట్ల పెట్టుబడి పెడతామని, 45 వేల మంది విద్యార్థులను చేర్చుకుంటామని, 6 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఎల్‌.వి. ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌, ఎన్‌ఎంసీ హెల్త్‌కేర్‌, బసవతారకం మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వంటి సంస్థలకు భూముల కేటాయింపులు జరిగాయి.

వివాంటా, వెస్టిన్‌, హిల్టన్‌, నోవోటెల్‌ వంటి ప్రముఖ హోటళ్లకు భూములిచ్చింది. పీపీపీ విధానంలో మైస్‌ హబ్‌(రూ.535 కోట్లు), అమరావతి మెరీనా(రూ.40 కోట్లు), 3 స్టార్‌ రివర్‌ ఫ్రంట్‌ రిసార్ట్‌(రూ.30 కోట్లు), రిటైల్‌ కం ఎంటర్‌టైన్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (రూ.28 కోట్లు), మల్టీపర్పస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(రూ.25 కోట్లు) వంటి ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించింది. రాష్ట్ర రాజధానిలో కార్యాలయాలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటికీ ఇప్పటికే అమరావతిలో భూముల కేటాయింపు జరిగింది. జాతీయ బ్యాంకులు, చమురు సంస్థలు వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకూ సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. మొత్తంగా 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 197 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు 23 ఎకరాలను కేటాయించింది.

వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, రెండు కేంద్రీయ విద్యాలయాలు, ఆర్‌బీఐ, కాగ్‌, సీబీఐ, ఇగ్నో, ఐఎండీ, సివిల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, విదేశ్‌ భవన్‌(భారత విదేశాంగ శాఖ), నేషనల్‌ బయోడైవర్సిటీ మ్యూజియం వంటివి ఉన్నాయి. ఎన్‌ఐడీకి అత్యధికంగా 50 ఎకరాలు కేటాయించింది. ఆ సంస్థ భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో నాబార్డ్‌, ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ వంటి సంస్థలు, ఎస్‌బీఐ తదితర జాతీయ బ్యాంకులు, పలు పెట్రోలియం, బీమా కంపెనీలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు చొప్పున ధర నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా, కొన్నింటికి తక్కువ ధరకు భూములిచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్నీ అమరావతిలో ఏర్పాటైతే సుమారు 5 వేల మంది అధికారులు, ఉద్యోగులు వస్తారని అంచనా. రాజధానిలోని నేలపాడు సమీపంలో ప్రజలకు విక్రయించేందుకు ‘హ్యాపీనెస్ట్‌’ పేరుతో 1,200 ఫ్లాట్ల నిర్మాణం తలపెట్టింది. వీటికి ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు నిర్వహించగా... వేలసంఖ్యలో పోటీపడ్డారు. బుకింగ్‌ ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే మొత్తం ఫ్లాట్ల బుకింగ్‌లు పూర్తయ్యాయి.

ఇదీ చదవండీ...

'అపారమైన శక్తి... అనంత విశ్వాసం: విజయ సాధనకు మార్గాలు'

Intro:Body:

Rajadhani

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.