'ఆంగ్ల మాధ్యమం కచ్చితంగా అమలు చేస్తాం' విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు అందించేందుకే.. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయని విమర్శించారు. తెదేపా సహా రాజకీయ పార్టీలు, తమ పిల్లలను తెలుగులో చదివిస్తున్నారా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోసం పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని అన్నారు. ప్రస్తుతం 62 శాతం పైగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ సిలబస్ మార్చుతున్నట్లు ప్రకటించారు. మాతృభాష వికాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లోని అధ్యాపకులకు వచ్చే ఏడాది జనవరి నుంచి మే వరకు 5 నెలల పాటు ఆంగ్ల బోధన కోసం అత్యున్నత సంస్థలతో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:'ఆంధ్రప్రదేశ్‌ను "ఆంగ్ల"ప్రదేశ్‌గా మార్చాలనుకుంటున్నారు'