గ్రామసచివాలయాల్లోనే గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు ఉంటాయని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మొత్తం 14,967 మంది కార్యదర్శులు ఉన్నారనీ.. వారికి 6 నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇస్తామని వివరించారు. పోలీసులతో పాటు మహిళలు, శిశు సంక్షేమ శాఖ అధికారులు శిక్షణలో పాల్గొంటారని స్పష్టంచేశారు. మహిళా కార్యదర్శులకు ఆత్మరక్షణ, యోగా వంటి తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి..