మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ లేని బలగాలను అమరావతిలో మోహరించారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. తప్పు చేస్తున్నందునే సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. 10 వేల మంది పోలీసులతో అసెంబ్లీ నిర్వహించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖలో రాజధానిపై ప్రజా బ్యాలెట్‌ను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని నిలదీశారు. విశాఖలో 52 వేల ఎకరాలు చేతులు మారాయని.. భూములు అమ్ముకోవటానికే రాజధాని తరలింపు ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. అమరావతిని చంపేస్తే... హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగేలా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ అంతర్గత ఒప్పందం చేసుకున్నారని అన్నారు. దేశంలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లే సీఎం.. జగన్ ఒక్కరే అని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: