ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దేవినేని అవినాష్ వైకాపాలో చేరారు. నమ్ముకున్న కార్యకర్తల కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని అవినాష్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు కష్టపడతానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారడానికి సహకరించిన వారందరికీ రుణపడి ఉంటానన్నారు. ఇన్నాళ్లూ ఆదరించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా... విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా బాధ్యతలు దేవినేని అవినాష్‌కు అప్పగించే అవకాశం ఉంది. కిందటి ఎన్నికల్లో అవినాష్ గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు.
ఇదీ చదవండి:దేవినేని అవినాష్ అనుచరుల్లో అసంతృప్తి!