విశాఖలో 36 వేల ఎకరాలకు పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధానిపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. భీమిలి, భోగాపురం విమానాశ్రయం దగ్గర విలువైన భూములను వైకాపా నేతల సన్నిహితులు కోనుగోలు చేశారని ఆరోపించారు. విశాఖలో ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజధానిపై ఎలా ప్రకటన చేస్తారని నిలదీశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డా... లేక జగన్మోహన్ రెడ్డా... అని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను సీఎం జగన్ ఖండించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : రహదారిపై రైతుల బైఠాయింపు.. వంటావార్పు