ఇదీ చదవండి : తెదేపా సోషల్ మీడియా కార్యకర్త ధూళిపాళ్ల అవినాష్ అరెస్టు
'అమరావతిని రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమిస్తాం' - cpi ramakrishna comments in JAC meeting news
అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన 'చైతన్యయాత్ర'ను పోలీసులు అడ్డుకోవడంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాలు బస్సుయాత్రలు చేయకూడదని ఎక్కడైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్యమంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అసెంబ్లీలో చెప్పిన మంత్రులు... చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని నిలదీశారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
cpi ramakrishna comments in JAC meeting