ETV Bharat / city

'ప్రత్యేక శాసనసభ సమావేశాలను అడ్డుకోండి' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

రాష్ట్రంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి రోజున రైతులను ఇబ్బందికి గురి చేసిన ముఖ్యమంత్రిగా.. జగన్ చరిత్రలో నిలిచిపోతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. అమరావతిలో రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. మరో రెండు రోజుల్లో జరిగే.. ప్రత్యేక శాసనసభ సమావేశాలను రైతులంతా కలిసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసుల సహాయం లేకుండా ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి రాజధానికి చేరుకోలేకపోతున్నారని అన్నారు. కృష్ణాయపాలెంలో రాజధాని కోసం ప్రాణాలర్పించిన రైతు కృపాదానం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

cpi-narayan-in-amaravathi
cpi-narayan-in-amaravathi
author img

By

Published : Jan 16, 2020, 3:23 PM IST

'ప్రత్యేక శాసనసభ సమావేశాలను అడ్డుకోండి'

'ప్రత్యేక శాసనసభ సమావేశాలను అడ్డుకోండి'
Intro:AP_GNT_27_16_NARAYANA_PARAMARSHA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) రాష్ట్రంలో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజున రైతులను ఇబ్బందికి గురి చేసిన ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం లో రాజధాని కోసం ప్రాణాలర్పించిన రైతు కృపాదానం కుటుంబ సభ్యులను నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లు పరామర్శించారు. కృపాదానం కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని సిపిఐ నేతలు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు నిర్వహించిన దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో అమరావతి ప్రాంతంలో జరగబోయే ప్రత్యేక శాసనసభ సమావేశాలను రైతులంతా కలిసి అడ్డుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. పోలీసుల సహాయం లేకుండా ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి రాజధానికి చేరుకోలేక పోతున్నారని విమర్శించారు. జగన్ మంత్రి మండలి లో అమాత్యులంతా పరమానంద శిష్యుల ను మించిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు.


Body:bites


Conclusion:కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.