కృష్ణానది వరదలపై అమెరికా నుంచి ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. సీఎంవో అధికారులు పంపిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్నవరద, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. ముంపు బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్నచర్యలపై సమాచారం తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే సాయం అందించమని, ఎలాంటి అలసత్వం చూపించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని సీఎం జగన్‌కు సీఎంవో అధికారులు తెలిపారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని వివరించారు.
డల్లాస్‌కు మఖ్యమంత్రి
సీఎం జగన్ వాషింగ్టన్ నుంచి డల్లాస్ వెళ్లనున్నారు. హచిన్సన్ కన్వెన్షన్‌లోని ప్రముఖులను కలిసిన అనంతరం ప్రవాసాంధ్రుల గురించి మాట్లాడనున్నారు. భారత కాలమాన ప్రకారం అర్ధరాత్రి 12.30 గం.కు డల్లాస్ చేరుకుంటారు. హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రముఖులను కలసిన అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 4.30 గం.కు ప్రసంగం ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి :