ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అధిగమించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అనవసర వ్యయాన్ని అధికారులు తగ్గించాలని సూచించారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులు ప్రయోజనకరంగా ఉండాలన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవడంపై యంత్రాంగం ఆలోచన చేయాలని తెలిపారు. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇచ్చే హామీల అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.
జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఏ పనికైనా శంకుస్థాపన చేస్తే 4 వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని తెలిపారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలన్నారు. సీఎంగా ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వమిచ్చే హామీగానే భావించాలని అధికారులకు తెలియజేశారు.