ETV Bharat / city

అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం... ఎందుకంటే?

సచివాలయంలో ఉదయం నుంచి సీఎం జగన్ వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామ, సచివాలయాల ఉద్యోగాలపై  సమీక్షించిన ఆయన... అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయ ఉద్యోగ భర్తీ ప్రక్రియ వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి విజయవంతం  చేసిన అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

సచివాలయాల ప్రారంభంపై సీఎం పలు సూచనలు
author img

By

Published : Sep 11, 2019, 4:25 PM IST

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 2 న గ్రామ, సచివాలయాల ప్రారంభ సన్నాహాలపై అధికారులతో చర్చించారు. 4 నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేయగలిగామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1902 కాల్ సెంటర్ సిద్ధం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. డిసెంబరులో కొత్త పింఛన్లు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

'ప్రజా సమస్యలపై స్పందనకు గ్రామ సచివాలయానికి ప్రత్యేక నంబర్ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ ఉండాలి. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలి. రైతుభరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రకృతి, సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. గ్రామసచివాలయాల ద్వారా దాదాపు 237 సర్వీసులు అందించాలి" - జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం కుమారపురం పంచాయతీ రత్నాయం పేట వద్ద ఉన్న పంపా నది పై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్థులు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.... గత కొన్నేళ్లుగా ఈ నదిపై వంతెన లేకపోవడంతో గ్రామస్థులు ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు మత్స్యకారులు సమీప తీరానికి వేటకు వెళ్లాలంటే నదిలో దిగి ప్రమాదకరమైన ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఇటీవల నదిపై వంతెన నిర్మాణానికి అధికారులు సర్వే నిర్వహిస్తే గ్రామానికి చెందిన ఒక భూస్వామి పనులు అడ్డగించే౦దుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తక్షణం అధికారులు విచారణ చేపట్టి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై తహసిల్దార్ అంబేద్కర్ మాట్లాడుతూ వంతెన పనులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకునే సర్వే చేపట్టి పనులు పూర్తి చేసేందుకు, అన్ని శాఖల అధికారులతో చర్చిస్తామని వివరించారు.

Body:b

Conclusion:k

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.