పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనపై ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తొలిదశలో భాగంగా.. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకే వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు పూర్తిస్థాయిలో సన్నద్ధత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంగ్ల బోధనపై సీనియర్ అధికారులతో సమావేశమై సమీక్షించిన సీఎం.. ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నాడు-నేడులో భాగంగా ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి.. మొదటి దశలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీషు మాధ్యమంలో బోధించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ విధానాలను పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: 'ఆంగ్ల మాధ్యమం కచ్చితంగా అమలు చేస్తాం'