ఉల్లి ధరలపై సీఎం జగన్ స్పందించారు. ప్రజలపై ఉల్లి భారం పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉల్లి ధర తగ్గేవరకు రైతుబజార్లలో కిలో రూ.25కే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రాయితీ భరించాలని మార్కెటింగ్ శాఖకు సూచించారు.
ఉల్లిని అక్రమంగా నిల్వచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మార్కెటింగ్, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. 18 రోజుల్లో 16 వేల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి సరఫరా చేశామని తెలిపారు.
ఇదీ చదవండి