ETV Bharat / city

కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం - latest crime news in chittoor district

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్‌లో దారుణం జరిగింది. అభంశుభం తెలియని 6ఏళ్ల చిన్నారిని.. దుండగులు హత్యచేశారు. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Child murder in Chittoor
author img

By

Published : Nov 8, 2019, 11:44 AM IST

Updated : Nov 8, 2019, 6:51 PM IST

చిత్తూరు జిల్లా కురబలకోట మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బంధువుల పెళ్లి కోసం వచ్చిన ఓ కుటుంబానికి చెందిన చిన్నారి హత్యకు గురవడం.. తీరని విషాదం నింపింది. బి.కొత్తకోట మండలం గుట్టపాలేనికి చెందిన రైతు సిద్ధారెడ్డి.. బంధువుల పెళ్లి కోసం.. కుటుంబ సభ్యులతో కలిసి కురబలకోట వచ్చారు. అందరూ పెళ్లి మండపంలో ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు సిద్ధారెడ్డి కుమార్తె వర్షిణిని అపహరించారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు.. వెదుకులాట ప్రారంభించారు.

కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం

విగతజీవిగా చిన్నారి..

తల్లిదండ్రులకు ఉదయం చిన్నారి మృతదేహం కనిపించింది. విగతజీవిగా మారిన చిన్నారిని చూసి అంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆరేళ్ల చిన్నారి ఏం పాపం చేసిందని హత్య చేశారంటూ... వారు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ సంఘటనతో గ్రామస్థులూ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యతో పాటు అత్యాచారం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం

ఇదీ చదవండి:

భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

Intro:చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో లో బాలిక హత్య

Body:బాలికపై అత్యాచారం ఆపై హత్య చేసిన దుండగుడు

Conclusion:ఓ చిన్నారి ని కామాంధుడు చిదిమేసిన సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ సమీపంలో జరిగింది బంధువుల వివాహానికి హాజరైన ఆ చిన్నారి కామాంధుడు చేతిలో అత్యాచారానికి గురై తుది ప్రాణాలు విడిచినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చిన్నారికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లిన దుండగుడు చిత్రాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమై నట్లు పోలీసులు అంటున్నారు కురబలకోట మండలం అంగళ్ళ సమీపంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన వివాహానికి బి కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్ట కింద పల్లి కి చెందిన భార్య భర్తలు ఉషారాణి సిద్ధారెడ్డి లో హాజరయ్యారు వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం బుధవారం రాత్రి వివాహానికి వెళ్లిన ఆ దంపతులు తమ పిల్లలు కూడా వెంట తీసుకెళ్లారు వివాహ సంబరాల్లో సంతోషంగా ఉన్నారు ఇదే సమయంలో తమ వెంట తీసుకొని వచ్చిన హతురా లు వర్షిత కనపడకుండా పోయింది తల్లిదండ్రులు బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికిన వర్షిత జాడ కనపడలేదు ఉదయం చేనేత నగర్ సమీపంలోని వంకలో చిన్నారి ఇ వర్షిత మృతదేహం కనుగొన్నారు చిన్నారి ఆరో తరగతి చదువుతోంది మృతురాలు శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి సంఘటన జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు నిందితుడు చిన్నారిని అపహరించి ఆపై అత్యాచారం చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి శవ పరీక్షలో ఉంచారు ముదివేడు పోలీసులు కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు తమకు ఎలాంటి కుటుంబ కలహాలు లేవని ఎవరితోనూ శత్రుత్వం లేదని బాధిత కుటుంబీకులు తెలిపారు
Last Updated : Nov 8, 2019, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.