తెనాలిలో జేఏసీ దీక్షా శిబిరానికి నిప్పు పెట్టి... వైకాపా చేసిన దమనకాండను ఖండిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. 3 రాజధానులపై ముఖ్యమంత్రి జగన్ మంకుపట్టును గర్హిస్తున్నాం అని ట్వీట్ చేశారు.
కౌన్సిల్ ఛైర్మన్‌పై మంత్రుల దాడి, తెనాలిలో తెదేపా ముస్లిం నాయకుడు ఖుద్దూస్పై దాడి బాధాకరమన్నారు. వైకాపా నేతల బరితెగింపు రాజకీయాలకు ముస్లిం సమాజమే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీలు, ప్రజా సంఘాలు నిరసించాలని పిలుపునిచ్చారు. భయంలో నుంచి తెగింపు వస్తుందనీ, తెగింపుతో కూడిన ధైర్యాన్ని ఎవరూ ఎదుర్కోలేరని పేర్కొన్నారు. అమరావతిని కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ట్విట్టర్ ద్వారా ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: సాక్షి దినపత్రికపై లోకేశ్ కేసు