
ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా.. దేశమంతా ధరలు పెరిగాయని వైకాపా మంత్రులు చెప్పడం హాస్యాస్పదమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పి చేతులెత్తేస్తారా అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారని, ఉల్లితో పాటు నిత్యావసరాల ధరలన్నీ చుక్కలంటాయని మండిపడ్డారు. 5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు..ఇప్పుడు ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉల్లి ధరల తడాఖా ఏంటో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే వైకాపా ప్రభుత్వానికి రుచి చూపిస్తారన్నారు. ఈ మేర అయన ట్విటర్లో ఓ వీడియో పెట్టారు.
ఇదీ చదవండి :