మార్కెట్లో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిసూ రైతులను బలి తీసుకుంటున్నారని ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మార్కెట్లో ఎక్కువ రేటు ఉన్నందుకే రైతులు మార్కెట్ యార్డులకు రావడం లేదని చెప్పటం దివాళాకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణం తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదేం జగన్మాయో..?
వేరుశెనగ పంట దిగుబడి వచ్చి రైతులు అమ్ముకోడానికి సిద్ధపడగానే మార్కెట్‌లో క్వింటా ధర 8వేల 200 నుంచి 4వేల రూపాయలకు అమాంతంగా పడిపోయిందన్నారు. ఒక్క నెలలో రైతు ఎకరానికి 20 వేల రూపాయల మేర నష్టపోయారని చెప్పారు. ఇదేం జగన్మాయో చెప్పాలని ఎద్దేవా చేశారు. దళారులను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ రైతులకు 3వేల కోట్లు.. మొక్కజొన్న రైతాంగానికి 600 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు. వైకాపా మేనిఫెస్టోలో చెప్పిన 5వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడుందని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: