తెదేపా అధినేత చంద్రబాబు.. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. వారు చేస్తున్న దీక్షా శిబిరాలకు వెళ్లి.. రైతులకు ధైర్యం చెప్పారు. కృష్ణరాయపాలెంలో రైతులను కలిశారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ నివాసానికి శాశ్వతంగా కంచె వేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కు, తనకు ప్రజలే పోలీసులని... తమకు పోలీసులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం అందరి దేవుళ్ల దీవెనలు తీసుకున్నామని అన్నారు. రాజధానిలో 75 శాతం బడుగు బలహీన వర్గాలు ఉన్నాయని.. హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం ఉండాలన్న లక్ష్యంతోనే అమరావతికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. అంతా కలిసి అమరావతిని కాపాడుకుందామని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పారు.
ఇవీ చదవండి..