రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళపై పోలీసుల దౌర్జన్యాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఒకవైపు భూమలు కోల్పోయి, మరోవైపు న్యాయం కోసం పోరాడుతుంటే నడిరోడ్లపై ఈడ్చేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా... పోలీసు రాజ్యమా..? అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేసే వాళ్లపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేంది లేదన్నారు. రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలేంటంటే?