ఇసుక వ్యవహరంలో ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇసుకను తవ్వడం దగ్గర నుంచి తరలించడం, నిల్వ చేయడం, అమ్ముకోవడం వరకూ అంతా అక్రమమేని దుయ్యబట్టారు. విషయాన్ని తెదేపా మొదటి నుంచి చెబుతోందని గుర్తు చేశారు. అంతా వైకాపా నేతలకు తెలిసే జరుగుతోందని..అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అక్రమాలతో నిర్మాణరంగ కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇసుక అక్రమాలపై ఈటీవీ-భారత్లో వచ్చిన కథనాన్ని తన ట్విట్టర్కి జత చేశారు చంద్రబాబు.
వైకాపా నేతల జేబులు నింపడానికే.. ఇసుక కొరత - tdp
ఇసుక కొరత సృష్టించింది కేవలం వైకాపా నేతల జేబులు నింపడానికేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.