ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.... గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. ఈమేరకు 13 పేజీల నివేదికను గవర్నర్ విశ్వభూషణ్‌కి చంద్రబాబు, పార్టీ నాయకులు కలిసి అందచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, కోడెల మృతి, తెలుగుదేశం నేతలపై కేసుల విషయంపై.... రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ని కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలు, పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమకేసులు పెడుతుందని ఆరోపించారు. డీజీపీ నుంచి కిందిస్థాయి వరకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే ఉసిగొల్పాయని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై 18 కేసులు అక్రమంగా పెట్టారని ఆరోపించారు. సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, చింతమనేని, నన్నపనేనితో పాటు... ఇతర నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై డీజీపీకి రెండు పుస్తకాలు అందచేసినా ఫలితంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్‌గా మీరైనా చొరవతీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని... బిశ్వభూషణ్‌కు చంద్రబాబు విజ్ఞప్తిచేశారు.
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ... ప్రభుత్వంపై ఫిర్యాదు.... - complaint to ycp
అమరావతి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు కలిశారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.... గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. ఈమేరకు 13 పేజీల నివేదికను గవర్నర్ విశ్వభూషణ్‌కి చంద్రబాబు, పార్టీ నాయకులు కలిసి అందచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, కోడెల మృతి, తెలుగుదేశం నేతలపై కేసుల విషయంపై.... రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ని కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలు, పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమకేసులు పెడుతుందని ఆరోపించారు. డీజీపీ నుంచి కిందిస్థాయి వరకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే ఉసిగొల్పాయని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై 18 కేసులు అక్రమంగా పెట్టారని ఆరోపించారు. సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, చింతమనేని, నన్నపనేనితో పాటు... ఇతర నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై డీజీపీకి రెండు పుస్తకాలు అందచేసినా ఫలితంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్‌గా మీరైనా చొరవతీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని... బిశ్వభూషణ్‌కు చంద్రబాబు విజ్ఞప్తిచేశారు.
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కమిటీ వేసి విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో యదేచ్ఛగా భారీగా ఫీజులను వసూలు చేస్తున్న ప్రభుత్వం నియంత్రణ చర్యలను చేపట్టకపోవడం శోచనీయం అని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర అన్నారు. వార్షిక ఫీజులే కాకుండా అడ్మిషన్ ,స్పెషల్ ఫీజులు పాఠ్య పుస్తకాలపై ఫీజులు ,యూనిఫారాలు, గేమ్స్ ఫండ్ ,సాంస్కృతిక కార్యక్రమాల పై ఫీజు ఇలా రకరకాల పేర్లతో తల్లిదండ్రుల వద్ద నుండి భారీగా ఉన్నాయని రవిచంద్ర మండిపడ్డారు. కార్పొరేట్ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం కేవలం 5 నుండి 10 శాతం వరకు మాత్రమే ఫీజులను పెంచాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా 40 శాతం వరకు గరిష్టంగా మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి అని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను కార్పొరేట్ పాఠశాలలు ఏమాత్రం పాటించడంలేదని, ఫీజు నియంత్రణ కమిటీ వేసి విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగాతీసుకోవాలన్నారు. పేరెంట్స్ కమిటీలను ఏర్పాటుచేసి రెగ్యులర్ సమావేశాలు నిర్వహించాలని కామన్ ఫీజు విధానాన్ని తక్షణమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
బైట్... రవిచంద్ర ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Body:AP_VJA_16_19_STUDENT_UNIONS_ROUND_TABLE_AVB_AP10050
Conclusion:AP_VJA_16_19_STUDENT_UNIONS_ROUND_TABLE_AVB_AP10050