ముఖ్యమంత్రి జగన్కు 'సభా హక్కుల ఉల్లంఘన' నోటీసు ఇస్తామని ప్రతిపక్షనేత, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి రాకుండా అడ్డుకుని వైకాపా నేతలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తిరిగి వాళ్లే తాను అనని పదాన్ని అన్నట్లుగా సభలో సృష్టించారని ధ్వజమెత్తారు. ఎంత కోపంలోనైనా వాళ్లలాగా సంస్కార హీనమైన భాష ఉపయోగించడం.. అమర్యాదకరంగా ప్రవర్తించడం తనకు రాదన్నారు. అలాంటి తన మీద కుట్రలు, ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. 6 నెలల పాలనలోని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి.. తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తనపైనా, తన పార్టీ పైనా వైకాపా చేసే కుట్రలను ప్రజలే తిప్పికొడతారన్నారు.
ఇవీ చదవండి: