రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు... రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం జగన్ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గత ఐదు నెలల అసమర్థ పాలన వల్ల కార్మికులు తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో...సీఎం తన వినోదాల కోసం నిర్మించుకున్న ఇంటికి 15 కోట్ల 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం షాకింగేనని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
ఇదీ చదవండి : తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి