ETV Bharat / city

రాజధాని పేరుతో తల, మొండెం వేరు చేస్తారా?: చంద్రబాబు - అమరావతిపై చంద్రబాబు కామెంట్స్

3 రాజధానులు అనేది పిచ్చి ఆలోచనని చంద్రబాబు విమర్శించారు. ఈ రోజు.. రేపు.. ఎనాటికైనా అమరావతి ప్రజారాజధానేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఏదైనా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాజధానిపై మంత్రులు రోజుకో మాట మాట్లాడి ప్రజలను భయాందోళనకు గురి చేశారన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోని నెట్టేందుకు వైకాపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

chandrababu
చంద్రబాబు
author img

By

Published : Dec 27, 2019, 5:24 PM IST

Updated : Dec 27, 2019, 8:46 PM IST

మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు
ఎప్పటికైనా.. అమరావతి ప్రజారాజధానే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిపై ప్రభుత్వం 7 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిపై మంత్రులు తలోమాట మాట్లాడి ప్రజలను గందరగోళానికి గురి చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్​ను అంధకారంలోకి నెట్టేసే పరిస్థితులను వైకాపా సృష్టిస్తుందని ఆరోపించారు. అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయం సమకూర్చే రాజధాని అమరావతి అని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం రూ.9,165 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అమరావతిలో అనేక అవకతవకలు జరిగాయని వైకాపా అవాస్తవ ప్రచారం చేస్తుందని విమర్శించారు.

ఇష్టానుసారంగా మారుస్తారా..?
ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టనుసారంగా రాజధానిని మారుస్తారా అని నిలదీశారు. భూములు ఇచ్చిన రైతులు 20 రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు కూలుతాయని గుర్తుంచుకోవాలన్నారు.

రైతు భాగస్వామ్య రాజధాని
అమరావతిలో ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉన్నాయన్న చంద్రబాబు.. డబ్బు లేదంటూనే వాటిని మళ్లీ విశాఖలో ఎలా కడతారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెప్పడం ఓ నెపం మాత్రమేనని ఆయన ఆరోపించారు. అమరావతిలో పెరిగిన భూమి విలువతోనే మహానగరం నిర్మించవచ్చని స్పష్టం చేశారు. రైతులను భాగస్వామ్యం చేస్తూ రాజధాని కట్టడం ప్రపంచ చరిత్రలో తొలిసారన్న చంద్రబాబు.. ప్రపంచస్థాయి రాజధానిగా ఆలోచించి ముందుకెళ్లామని తెలిపారు.

తల, మొండెం వేరు చేస్తారా?
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. రాజధాని పేరుతో తల, మొండెం, చేతులు వేరుచేస్తే ఎలా అని ప్రశ్నించారు. 3 రాజధానులు అనేది పిచ్చి ఆలోచనని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 రాజధానుల ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలకు రాజధానులు ఉన్నట్లు రాష్ట్రానికి రాజధాని వద్దా అని నిలదీశారు. మట్టి పనులు, పాచి పనులకు హైదరాబాద్‌, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకన్నారు. గతంలో జగన్, ఉమ్మారెడ్డి వ్యాఖ్యల వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు.

విజయసాయిరెడ్డికి ఏ అధికారం ఉంది?
అమరావతి దేవభూమి, చారిత్రక నగరం... అందుకే రాజధాని ఎంపిక చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని కట్టుకోలేదని ప్రజలను ఎగతాళి చేసేలా చేస్తున్నారన్నారు. బోస్టన్‌ కమిటీ, హైపవర్ కమిటీ పేరుతో ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అనిశ్చితి పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాజధానికి సీఎం వస్తారని విశాఖలో విజయసాయిరెడ్డి చెబుతున్నారన్న చంద్రబాబు...ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి విజయసాయిరెడ్డికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు.

విశాఖపై చంద్రబాబు వ్యాఖ్యలు

ఆ సంస్థలను ఎందుకు వెళ్లగొట్టారు
నిన్నటివరకు ఒక సామాజికవర్గంపై అవాస్తవాలు చెప్పిన జగన్​.. ఇప్పుడు డబ్బులు లేవని మాటమార్చారని విమర్శించారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, తడ నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి అమరావతిని నిర్ణయించామని స్పష్టం చేశారు. విశాఖను పర్యటక కేంద్రంగా చేసేందుకు ప్రణాళికలు రచించామన్న చంద్రబాబు... విశాఖపై వైకాపాకు అంత ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అంతర్జాతీయ సంస్థలను తీసుకొస్తే....వైకాపా వెళ్లగొట్టిందని ఆరోపించారు.

ఇన్​సైడర్ ట్రేడింగ్​పై చంద్రబాబు వ్యాఖ్యలు

హైకోర్టు జడ్జితో... విచారణకు సిద్ధమా..?
అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చన్నారు. విశాఖ భూఅక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జీఎన్‌రావు గ్రూప్‌-1 ఆఫీసర్‌.. ఆయన ఎందులో నిపుణులో చెప్పాలన్నారు. సీఎం జగన్ చెప్పిందే జీఎన్‌రావు కమిటీ నివేదికలో రాసిందన్నారు. తనపై కోపంతో రాజధాని తరలిస్తారా అని చంద్రబాబు అన్నారు.

జీఎన్ రావు కమిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు

ఇదీ చదవండి :

'కలల రాజధాని కాదు... అభివృద్ధి, సంక్షేమమే మాకు ముఖ్యం'

Last Updated : Dec 27, 2019, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.