రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చేపట్టబోయే ముఖ్యమైన పనులు విజయవంతం కావాలని... ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి కావాలని వినాయకుడిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాదిలో విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలని... ఆ గణనాథుడు ప్రజలందరికీ సుఖసంతోషాలు కల్పించాలని కోరుకున్నారు. కాలుష్య రహితంగా వినాయకచవితి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకున్ని పూజించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రజలు తలచిన పనులు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ... జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులందరినీ భగవంతుడు అనుగ్రహించాలని వేడుకున్నారు. ఈ పండుగను మనమందరం పర్యావరణ హితంగా, ఆరోగ్యకారకంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయకుడ్ని అందరి ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తెలుగు వారందరికీ, విఘ్నేశ్వరుడ్ని పూజించే ప్రతి ఒక్కరికీ తన తరపున, జనసైనికుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ప్రజలకు గవర్నర్ వినాయకచవితి శుభాకాంక్షలు