ETV Bharat / city

వారికి అండగా పవన్ వెళ్లడం నేరమా?: చంద్రబాబు

author img

By

Published : Dec 31, 2019, 8:12 PM IST

రాజధానిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవడాన్నితెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. అమరావతి రైతులు, రైతుకూలీలు, మహిళలకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్​ను అడ్డుకోవడం అనైతికం, అప్రజాస్వామికమన్నారు.

chandrababu about pawan capital tour
chandrababu about pawan capital tour

రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలు, రైతు కూలీలకు అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్​వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం చెప్పడం తప్పా అని అడిగారు. 7నెలలుగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లో ముంచేశారన్న చంద్రబాబు... సమస్యల పరిష్కారం సాధ్యంకాక వాటిని మించిన సమస్యలను సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్‌

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.