ETV Bharat / city

మైక్ ఇవ్వడానికి సీఎం అనుమతి ఏంటి?: చంద్రబాబు - తమ్మినేని సీతారాం వార్తలు

సభాపతి తమ్మినేని సీతారాం తీరు సరిగా లేదని చంద్రబాబు అన్నారు. మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. హుందాగా సభను నడపాలని సూచించారు.

chandra babu
చంద్రబాబు
author img

By

Published : Dec 11, 2019, 6:49 PM IST

Updated : Dec 11, 2019, 10:26 PM IST

అధికారం ఉంది కదా అని వైకాపా అహంకారంతో వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అహంభావంతో వారు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. సభాపతి ప్రవర్తన, పద్ధతి సరిగా లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. మైక్ ఇమ్మని కోరితే తమకు ఇవ్వకుండా.. అధికార పక్షంలో 10 మందికి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. సభలో ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉంటే మైక్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీలో తాము దీటుగా సమాధానం చెప్పటంతో ఇవాళ ఏకపక్షంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతూ... తమ వాదన చెప్పే అవకాశం ఇవ్వట్లేదని మండిపడ్డారు. స్పీకర్ నిగ్రహంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మైక్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నారని... ఈ అంశంపై రేపు సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద నిరసన తెలపనున్నట్టు చంద్రబాబు తెలిపారు. దీనిపై గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

మీడియాతో చంద్రబాబు

వంశీకి ప్రత్యేక స్థానం ఏంటి?
శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి సభాపతి ప్రత్యేక స్థానం కల్పించటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. పార్టీ నుంచి సస్పెండ్​ చేసిన వ్యక్తికి ప్రత్యేక స్థానం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. వంశీపై పూర్తి బహిష్కరణ వేటు పడితే తప్ప అతను ప్రత్యేక సభ్యుడు కాదని అన్నారు.

ఇవీ చదవండి..

మహిళా భద్రత బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

Last Updated : Dec 11, 2019, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.