ETV Bharat / city

పీపీఏలపై పునఃసమీక్ష అనవసరం...సీఎం జగన్​కు కేంద్రమంత్రి​ లేఖ - పీపీఏలపై పునఃసమీక్ష అనవసరం

పీపీఏల పునఃసమీక్ష విషయంలో మరోసారి కేంద్రం అభ్యంతరం తెలిపింది. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. పునఃసమీక్ష చేయాలన్న నిర్ణయం సరికాదని కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్​.కె.సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ లేఖ రాశారు.

సీఎం జగన్​కు కేంద్రమంత్రి​ లేఖ
author img

By

Published : Sep 25, 2019, 8:01 PM IST

Updated : Sep 25, 2019, 8:18 PM IST

'పీపీఏలపై పునఃసమీక్ష అనవసరం'

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై కేంద్రం మరోసారి అభ్యంతరం తెలిపింది. గత ఒప్పందాలను సమీంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై సీఎం జగన్‌కు కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ మరో లేఖ రాశారు. పీపీఏలు సమీక్షించడం సరైన నిర్ణయం కాదన్నారు. పీపీఏల పునఃసమీక్షపై జులై 25న ప్రధానికి సీఎం జగన్‌ రాసిన లేఖలోని ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ లేఖ రాస్తున్నట్లు ఆర్‌.కె.సింగ్‌ స్పష్టం చేశారు.

ఏపీ కన్నా ఆ మూడు రాష్ట్రాల్లో ధర ఎక్కువ

డిస్కంల ఆర్థిక పరిస్థితిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్న కేంద్ర మంత్రి... 2016-17లో ఏపీలో యూనిట్‌ రూ.4.84గా నిర్ణయించారని తెలిపారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో రూ.5.76, 5.56, 4.78గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఏపీతో పోలిస్తే ఈ మూడు రాష్ట్రాల్లో ధర అధికంగానే ఉందని స్పష్టం చేశారు. ధరలు ఏటా మారుతుంటాయనే విషయం గమనించాలని లేఖలో పేర్కొన్న కేంద్రమంత్రి... కేంద్రం తెచ్చిన ఉదయ్‌ పథకం ప్రకారం ధరలు పెంచాల్సి ఉందన్నారు. ధరలు పెంచకపోవడం వలనే డిస్కంలకు నష్టాలు వచ్చాయని ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. ఉదయ్‌ నిబంధనల మేరకు ఏపీలో టారిఫ్‌ రేట్లు తక్కువగానే ఉన్నాయన్నారు.

ధరల స్థిరీకరణ పాటిస్తున్నాం

దీర్ఘకాలిక మనుగడకు ధరల స్థిరీకరణ సిద్ధాంతం పాటిస్తున్నామన్న కేంద్రమంత్రి.. జర్మనీ, చైనాను ఉదహరిస్తూ ఒప్పందాలు ఎలా ఉంటాయో లేఖలో ప్రస్తావించారు. థర్మల్ యూనిట్ ధర 25 ఏళ్లలో రూ.22 అవుతుందన్న కేంద్రమంత్రి... పునరుత్పాదక విద్యుత్‌ ధర 25 ఏళ్ల తర్వాత రూ.4.2 కే వస్తుందని చెప్పారు. 2014లో రూ.6.70 ఉన్న సౌరవిద్యుత్.. ఇప్పుడు రూ.3 లోపే వస్తోందని లేఖలో పేర్కొన్నారు. ధరలు తగ్గడానికి ప్రపంచ మార్కెట్‌లో సోలార్ పరికరాల విలువ తగ్గడమేనని గుర్తు చేశారు. థర్మల్‌తో పోలిస్తే పవన, సౌర కేంద్రాల స్థాపిత ఖర్చు బాగా తగ్గిందని తెలిపారు.

పునఃసమీక్ష అనవసరం

ఒప్పందాల్లో అవకతవకలు రుజువైతేనే పునఃసమీక్షకు వెళ్లాల్సి ఉంటుందన్న కేంద్రమంత్రి... అన్ని ఒప్పందాలనూ ఒకే విధంగా చూడటం సరికాదన్నారు. అవినీతిపై ఆధారాలుంటే ఆ కంపెనీపైనే సమీక్ష చేయాలని సూచించారు. పీపీఏలపై పునఃసమీక్ష నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సమీక్షలు పునరుత్పాదక విద్యుదుత్పత్తి, పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతుందన్నారు. దేశ విద్యుత్‌రంగ విధానంపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఘాటుగా స్పందించారు.

ఇదీ చదవండి:

పీపీఏలపై వైకాపా ఆరోపణలు అవాస్తవమని తేలింది:తెదేపా

Intro:ATP :- అనంతపురంలో మోహరం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. చిన్న మొహరం వేడుకల సందర్భంగా నగరంలోని నాలుగో ఐదో రోడ్లలో ఏర్పాటుచేసిన పీర్ల స్వాములు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నిన్న రాత్రి గుండ ప్రవేశం చేసిన స్వాములు ఇవాళ కాలనీలో ఊరేగింపు చేస్తున్నారు.

Body:డప్పుల వాయిద్యాలతో నడుమ ఊరేగింపు సందడిగా సాగింది. వన్నూరువలి, అంగారువలి, ఆసెన్, హుస్సేన్ స్వాముల కలయిక శాంతినగర్ లో సందడిగా జరిగింది. రేపు స్వాముల జలధి కార్యక్రమం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Last Updated : Sep 25, 2019, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.