హైదరాబాద్ జనసేన కార్యాలయంలో అమరావతి రైతులు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదని వాపోయారు. మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఆందోళన చెందుతున్నామన్నారు. రాజధానిని వేరేచోటికి తరలిస్తారేమోనని భయపడుతున్నామని...అన్ని పార్టీలు, సామాజికవర్గాల మద్దతు కూడగడుతున్నట్లు రైతులు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని పరిస్థితులను పవన్‌కు రైతులు వివరించారు. కొండవీటి క్యాచ్మెంట్ హిల్ ప్రాంతంలో గతంలో 16వేల క్యూసెక్కులకు మించి నీరు ఎప్పుడూ రాలేదన్నారు. 1903లో మాత్రమే 222 మి. మీ వర్షం పడిందని...ఆ తర్వాత 2005-06లో 166మి. మీ వర్షం మాత్రమే పడిందన్నారు.
రాజధాని ముంపు ప్రాంతం కాదు..
రాజధాని ముంపు ప్రాంతం కాదని...రాజధానిలోనూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని...కొన్ని చాలా పురోగతిలో ఉన్నాయని రైతులు తెలిపారు. గ్రామస్థులంతా సమావేశాలు పెట్టుకుని 28వేల మంది రైతులు ...34వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చామని అన్నారు.
రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని.. .రాష్ట్ర ప్రజలదని జనసేనాని రైతులకు తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని పవన్‌కళ్యాణ్ రైతులకు తెలిపారు. ఈ పర్యటనలో అమరావతిలో నిలిచిపోయిన పనులను జనసేనాని పరిశీలించనున్నారు.