తెలంగాణలోని హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 19నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న 50వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొంటాయని తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల ఐకాస ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ ప్రకటించారు. కిలోమీటర్‌కు కనీస రుసుము రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీ అందించాలని, ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పని చేస్తున్న వారికి జీవో 61, 66 అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సలావుద్దీన్ కోరారు.
ప్రయాణం ప్రయాసే... 19 నుంచి క్యాబ్‌ల బంద్ - Cab Drivers Strike In Telangana State on 19th October
తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె 14 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పుడు మరో వర్గం కూడా సమ్మెకు దిగబోతోంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్ల ఐకాస నిర్ణయించింది.