బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ అమలుకు ముసాయిదా అవగాహనా ఒప్పందాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీతో ఎంవోయూ కుదుర్చుకోనుంది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈ మేరకు అనుమతిచ్చారు. ఎన్బీసీసీ భాగస్వామ్యంతో బిల్డ్ ఏపీ మిషన్‌ను ప్రభుత్వం అమలు చేయనుంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్‌బీసీసీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. నిరుపయోగ భూములు గుర్తించి మౌలిక వసతులను కల్పించనుంది. విద్య, వైద్య వసతుల కల్పనలో నిధుల సమీకరణకు బిల్డ్ ఏపీ మిషన్ కార్యాచరణ రూపొందించనుంది. శాఖలు, సంస్థలు, వర్సిటీల భూమిని జిల్లా ప్రణాళికా సంఘం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. భూ యాజమాన్య హక్కులు బదలాయించేలా నిబంధనలు మార్చాలని జీవోలో వెల్లడించింది. భూ వివరాలను ఎన్బీసీసీ అందించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి:రియల్ ఎస్టేట్‌కు ఊతం.. రాష్ట్ర ప్రభుత్వ నూతన పథకం