బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)
బోస్టన్ గ్రూప్ ఇక్కడిది కాదు. అమెరికాకు చెందిన సంస్థ. 1963లో స్థాపించారు. తర్వాత 50 దేశాలకు ఈ కంపెనీ విస్తరించింది. మెుత్తం దీనికి 90 బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ సీఈవో రిచ్ లెసర్. ఆయా దేశాలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాజెక్టులను రూపొందించడం, సలహాలు, సూచనలు ఇవ్వడం బోస్టన్ గ్రూప్ పని.
పలు నిర్మాణాలు, మౌలిక సదుపాయల కల్పనపైనే ఇంతవరకు బోస్టన్ కంపెనీ సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పాలనాపరమైన అంశంపై ఈ కంపెనీ నివేదిక ఇవ్వనుంది.
ఇదీ చదవండి: జనవరి మూడు తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం