అమరావతి ఆర్థిక భారమే.. తేల్చిన బీసీజీ నివేదిక ‘‘పెట్టుబడులు- రాబడి అనే కోణంలో చూస్తే అమరావతి నిర్మాణంతో ఆర్థిక భారం పెరుగుతుందని బీసీజీ నివేదికలో పేర్కొంది. అమరావతి దార్శనికపత్రంలో పేర్కొన్న లక్ష్యాలను చేరుకోవాలంటే రూ.1.10లక్షల కోట్లు అవసరం. అంత డబ్బు ఒకే నగరంపై పెట్టడం అవసరమా? అనేది ఆలోచించాలి. అమరావతి నిర్మాణానికి రుణం తెస్తే ఏటా రూ.10వేల కోట్ల వడ్డీ కట్టాలి. అక్కడ భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవు. 40 ఏళ్ల తర్వాత వచ్చే రాబడి కోసం ఇప్పుడింత పెట్టుబడి అవసరం లేదు. అమరావతిపై పెట్టే రూ.లక్ష కోట్లను నీటి పారుదలపై పెడితే మంచి ఫలితాలొస్తాయి. ఆ నిధులను అన్ని ప్రాంతాల్లోని సాగు, తాగునీటిపై పెడితే ఉత్తమ ఫలితాలొస్తాయి. ఇతర రంగాలపై పెట్టుబడి పెడితే సత్వర అభివృద్ధి, సమగ్రాభివృద్ధి సాధ్యం. నీటి పారుదలపై పెడితే ప్రాంతీయ అసమానతలు తొలగుతాయి. అసలు ప్రభుత్వం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయా? ఇప్పటికే రూ.2.5లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రం అంత పెట్టుబడి పెట్టగలా? అమరావతిపై పెట్టే డబ్బు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెడితే మంచిది. విశాఖ నగరం మంచి మౌలిక సదుపాయాలు కలిగి ఉంది. ప్రజలతో సంబంధం లేని శాఖలను ఒక గ్రూపుగా పరిగణించాలి’’ అని కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు ప్రణాళిక అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి : బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలేంటంటే?