థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరతపై ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. థర్మల్ కేంద్రాలకు 57 శాతానికి పైగా బొగ్గు సరఫరా తగ్గిందని వెల్లడించింది. ఒడిశా మహానది బొగ్గు గనుల నుంచి సరఫరా తగ్గిందని పేర్కొన్న ప్రభుత్వం... సమస్యకు సమ్మెలు, భారీ వర్షాలనూ కారణంగా తెలిపింది. కొరత ప్రభావం.. థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొంది. ఆగస్టులో డొంకరాయి దిగువ సీలేరులోని పవర్ కెనాల్‌కు గండి పడిందని.. భారీ వర్షాల కారణంగా పునరుద్ధరణ పనులకు ఆంటకం కలిగిందని వివరించింది.
నవంబరు 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్‌ను అప్పుగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్ 15, 2019 నుంచి సంబంధిత అప్పులను తీరుస్తున్నామని... సెప్టెంబరు 30తో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సింగరేణి నుంచి ఉత్పత్తి పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకూ కూడా లేఖ రాశారు.
ఇదీ చదవండి: