ETV Bharat / city

తెలంగాణలోని శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళ హత్య - శంషాబాద్​లో మరో దారుణం వార్తలు

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

another-murder-in-shamshabad
తెలంగాణలోని శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళ హత్య
author img

By

Published : Nov 29, 2019, 10:50 PM IST

Updated : Nov 30, 2019, 12:29 AM IST

తెలంగాణలోని హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు మృతదేహంపై కిరోసిన్‌ పోసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగిన ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళను ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టారా..? లేక ఇక్కడే హత్యాచారం చేసి మృతదేహాన్ని తగలబెట్టారా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహం కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది.

తెలంగాణలోని శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళ హత్య

ఆ ప్రదేశం నిర్మానుష్య ప్రాంతం కావడంతో... పూర్తి సమాచారం సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. మృతదేహం దగ్ధమవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న వారు చూసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోలీసులకు సమాచారమందించారు. యువతి హత్యకేసును 48 గంట్లలోపే చేధించామని పోలీసులు భావిస్తున్న తరుణంలో... సిద్దులగుట్ట రోడ్డులో జరిగిన ఈ ఘటన పోలీసులకు మరో సవాల్‌గా మారింది.

ఇదీ చదవండి : యువ వైద్యురాలి హత్యకేసులో నలుగురు అరెస్టు

Intro:Body:Conclusion:
Last Updated : Nov 30, 2019, 12:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.