ETV Bharat / city

కాళ్లు చేతులు కోల్పోయి... మళ్లీ కుంచె పట్టి...

నిన్నటి వరకు అక్షరాలు దిద్దిన ఆ చేతులు పోయాయి. చిన్నారి పాదాలతో బుడిబుడి అడుగులు వేయాల్సిన ఆ పసివాడు... ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్నాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మళ్లీ మొదటి నుంచి ఓనమాలు ప్రారంభించాడు.

hand lost boy drawing at sanga reddy
author img

By

Published : Nov 16, 2019, 5:00 PM IST

కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంకోల్​ గ్రామానికి చెందిన తుల్జారాం, ప్రమీల దంపతుల తనయుడు మధుకుమార్. ఆ బాలుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కాళ్లు, చేతులు కోల్పోయాడు. నెలరోజులు ఆసుపత్రిలో ఉన్న తరువాత ఇంటికొచ్చిన మధు.. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాడు. చదువుకోవాలన్న తపనను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు.

మధుకుమార్ పరిస్థితిపై ''ఈటీవీ భారత్''​ గతంలో ప్రచురించిన కథనాలకు... బీడీఎల్​ విన్నర్​ ఫౌండేషన్​ సేవా సంస్థ అధ్యక్షుడు అరికెపూడి రఘు, చిత్రకళలో గిన్నిస్​ రికార్డు సాధించిన సముద్రాల హర్ష స్పందించారు. మధు​కు నోటితో అక్షరాలు రాసేలా శిక్షణ ఇచ్చారు. నోటిలో కుంచె పెట్టి... తొలుత అమ్మ అనే అక్షరాలు రాయించారు. త్వరలోనే మధును జర్మనీకి తీసుకెళ్లి... కృత్రిమ చేతులు అమర్చేందుకు కృషి చేస్తామని ఆ వదాన్యులు బాలుడికి భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి : ఆకులపై చెక్కినా.. చెక్కుచెదరని చిత్ర కళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.