ETV Bharat / city

అమరావతి మలిదశ ఉద్యమం: నేడే సకలజనుల సమ్మె

author img

By

Published : Jan 2, 2020, 4:59 PM IST

Updated : Jan 3, 2020, 12:29 AM IST

రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. 16 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేదని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యమకారులు చెప్పారు.

amaravathi sakalajanula samme
amaravathi sakalajanula samme

నేటి నుంచి సకల జనుల సమ్మె చేయాలని రాజధాని ప్రాంత రైతుల ఐక్య కార్యచరణ సమితి (జేఏసీ) నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని రైతులు స్పష్టం చేశారు.

వీటికి మినహాయింపు

ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల సరఫరా తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తామని జేఏసీ తెలిపింది.

బీసీజీ నివేదిక సిద్ధం

రాజధాని అమరావతిపై 'బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్' నివేదిక సిద్ధమైంది. నేడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​కు బీసీజీ కంపెనీ ప్రతినిధులు నివేదిక ఇవ్వనున్నారు. ఈనెల 8న మంత్రివర్గ సమావేశంలో నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది.

ఇదీ చదవండి: 'ఒక్క పెయిడ్ ఆర్టిస్టును చూపించినా.. ఉద్యమం ఆపేస్తాం'

Intro:Body:Conclusion:
Last Updated : Jan 3, 2020, 12:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.