ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: మూడు రాజధానులపై అమరావతి రైతుల ఆందోళన

author img

By

Published : Dec 21, 2019, 7:22 AM IST

Updated : Dec 21, 2019, 5:14 PM IST

amaravathi-latest
amaravathi-latest

17:12 December 21

రేపటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన రాజధాని ఐక్య కార్యాచరణ సమితి

రేపటి ఉద్యమ కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. 

  • .8.30 గం.కు ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో వంటా వార్పు
  • .8.30 గం.కు తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలో మహాధర్నా
  • .8.30 గం.కు వెలగపూడిలో ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు

 ఈ నిరసన కార్యక్రమాల్లో 29 గ్రామాల రైతులు పాల్గొంటారని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది.

16:47 December 21

పెదవడ్డపూడిలో రైతుల ధర్నా..రోడ్డుపై బైఠాయింపు

రాజధాని రైతులకు మద్దతుగా మంగళగిరి మం. పెదవడ్లపూడిలో రైతుల ధర్నాకు దిగారు.  రాజధానిని మార్చవద్దంటూ రహదారిపై బైఠాయించారు. 

16:09 December 21

రాయపూడి: గ్రామ సచివాలయానికి నల్లరంగు వేసిన వైకాపాకు చెందిన రైతులు

undefined

రాయపూడి పంచాయతీ కార్యాలయానికి వైకాపాకు చెందిన రైతులు  నల్లరంగు వేశారు. గ్రామ సచివాలయానికి ఉన్న  రంగులను మార్చారు.  రాజధాని మార్పుతో తమకు అన్యాయం చేసిన ప్రభుత్వ రంగులు ఉండటానికి వీల్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

15:14 December 21

వెలగపూడి రైతుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన కృష్ణా జిల్లా తెదేపా నేతలు

రైతుల దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ అర్జునుడు
ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని జగన్ ఎలా మారుస్తారు: దేవినేని
రాజధాని ముంపు ప్రాంతమని ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమ

14:29 December 21

అమరావతి: కృష్ణాయపాలెంలో గ్రామస్థుల ఆందోళన

రోడ్డుపై బైఠాయించి మహిళలు, రైతుల నిరసన

జీఎన్‌రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌

14:26 December 21

విజయవాడ: భాజపా నేత పురందేశ్వరిని కలిసిన రాజధాని గ్రామాల రైతులు

అభివృద్ధి వికేంద్రీకరణను భాజపా మొదట్నుంచీ సమర్థిస్తుంది: పురందేశ్వరి

జీఎన్ రావు కమిటీ బహిర్గతం కాలేదు, మంత్రివర్గంలో చర్చ జరగాలి: పురందేశ్వరి

వైకాపా ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలి: పురందేశ్వరి

రైతులకు సమాధానం చెప్పాక 3 రాజధానులపై భాజపా స్పందిస్తుంది: పురందేశ్వరి

13:14 December 21

తుళ్లూరులో జీఎన్ రావు కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్న రైతుల ఆందోళన

జీఎన్ రావు కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్న రైతుల ఆందోళనలతో తుళ్లూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయని వైకాపా రంగులు తుడిచేస్తామని గ్రామస్థులు తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది

13:11 December 21

గుంటూరు: తాడేపల్లి మండలం గుండిమెడలో రైతుల ధర్నా

తాడేపల్లి మండలం గుండిమెడలో రైతుల ధర్నా

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నాచేసిన రైతులు

రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్‌కు తరలింపు

రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న తెదేపా నేతలు

13:11 December 21

తుళ్లూరు పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసిన గ్రామస్థులు

అడ్డుకున్న పోలీసులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం

13:11 December 21

కులాలు, మతాలకు అతీతంగా అందరూ ఒక ఐకాసగా ఏర్పడాలి: శ్రవణ్‌కుమార్‌

రాజధాని అమరావతి కోసం కేంద్రంతో మాట్లాడదాం: శ్రవణ్‌కుమార్‌

11:22 December 21

అమరావతి: వెలగపూడి, మల్కాపురం గ్రామ పంచాయతీలకు నల్లరంగు

పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తుడిచేసిన వైకాపా కార్యకర్తలు

వైకాపా కార్యకర్తలకు మద్దతు పలికిన గ్రామస్థులు, అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

పోలీసులను నెట్టుకుని పంచాయతీ కార్యాలయాలకు నల్లరంగు వేసిన రైతులు

10:49 December 21

గుంటూరు: తాడికొండ అడ్డరోడ్డు వద్ద తెదేపా ఆందోళన

అమరావతిలో రాజధాని కొనసాగించాలని డిమాండ్

ఆందోళనకారులను పంపేందుకు పోలీసుల యత్నాలు

పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట

10:25 December 21

అమరావతి: వెలగపూడిలో పరిస్థితి ఉద్రిక్తం

అమరావతి: వెలగపూడిలో పరిస్థితి ఉద్రిక్తం

గ్రామ పంచాయతీ కార్యాలయానికి తమ పార్టీ రంగులు తుడిచేస్తున్న వైకాపా కార్యకర్తలు

పోలీసులను నెట్టుకుని పంచాయతీ కార్యాలయానికి నల్ల రంగు వేస్తున్న రైతులు

09:27 December 21

తుళ్లూరు వద్ద రహదారిపై రైతుల మహాధర్నా

తుళ్లూరు వద్ద రహదారిపై రైతుల మహాధర్నా

రహదారిపై వాహనాలను అడ్డంగా ఉంచడంతో నిలిచిన రాకపోకలు

సచివాలయానికి వెళ్లే మార్గంలో స్తంభించిన రాకపోకలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్

రాయపూడి సీడ్ యాక్సెస్ రహదారిపై రైతుల నిరసన

అర్ధనగ్నంగా బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

మూడు రాజధానుల ప్రకటన తక్షణం వెనక్కితీసుకోవాలని డిమాండ్

రోడ్డుపై వంటావార్పు చేసి ఆందోళన చేస్తున్న రైతులు

జీఎన్ రావు కమిటీ నివేదికను వెనక్కు తీసుకోవాలని డిమాండ్

సచివాలయానికి వెళ్లే మార్గాల్లో బైటాయించిన రైతులు

సీడ్ యాక్సెస్ రహదారిపై పోలీసు బందోబస్తు

08:09 December 21

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల నిరసనలు

రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అమరావతి.. మందడంలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా రాకుండా రైతులు  అడ్డుకున్నారు.రోడ్డుపై సిమెంటు బల్లలు, కుర్చీలు అడ్డుగా  ఉంచారు.  మందడంలో భారీగా పోలీసుల మోహరించారు. మందడంలో రైతులు టైర్లు తగలబెట్టారు. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మంగళగిరి మండలం కొరగల్లులో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు.

07:19 December 21

రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మందడం లైబ్రరీ సెంటర్‌లో మహాధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గం.కు వెలగపూడిలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలకు తుళ్లూరులో రైతులు మహాధర్నా కొనసాగించనున్నారు. ఉ. 9 గం.కు సీడ్ యాక్సిస్ రహదారి రాయపూడిలో హైకోర్టు మార్గంలో వంటావార్పు కార్యక్రమం.. ఉదయం 9 గంటల నుంచి తాడికొండ అడ్డరోడ్డు కూడలిలో రైతుల ధర్నా...ఐదు ప్రాంతాల్లో 29 గ్రామాల రైతుల నిరసనలు తెలుపుతున్నారు.  రాజధాని రైతులతోపాటు ధర్నాలో తెదేపా శ్రేణులు పాల్గొననున్నాయి.

06:58 December 21

లైవ్ అప్​డేట్స్: మూడు రాజధానులపై అమరావతి రైతుల ఆందోళన

అమరావతి: మందడంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు

స్పీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా రాకుండా అడ్డుకున్న రైతులు

రోడ్డుపై విద్యుత్‌ స్తంభం, బెంచీలు, కుర్చీలు ఉంచిన రైతులు

అమరావతి: మందడంలో భారీగా మోహరించిన పోలీసులు

Intro:Body:

LIVE

Conclusion:
Last Updated : Dec 21, 2019, 5:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.