రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ రేపటినుంచి కృష్ణా జిల్లాలో వివిధ సంఘాలు ఆందోళనలు చేపట్టనున్నాయి. రైతుల దీక్షకు మద్దతుగా విజయవాడలో వివిధ ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో లయోలా కళాశాల వాకర్స్ అసోసియేషన్, సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, క్రెడాయ్, బిల్డర్స్ అసోసియేషన్, ఐఎంఏ, ఇతర ప్రజా, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
ఇవీ చదవండి..