వెలగపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిలే నిరాహారదీక్ష ముగియగానే పలువురు గ్రామస్థులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన పలువురిని పోలీసులు కిందకు దించారు.
మిన్నంటిన రాజధాని రైతుల ఆందోళనలు - amaravathi farmers protest

17:31 December 22
వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్థులు
14:27 December 22
రైతుల ఆందోళనకు న్యాయవాదుల మద్దతు
- అమరావతి రైతుల ఆందోళనలకు గుంటూరు జిల్లా న్యాయవాదులు మద్దతు తెలిపారు. రేపు విధులు గుంటూరు జిల్లా న్యాయవాదులు బహిష్కరించనున్నారు.
13:49 December 22
వంటావార్పు కార్యక్రమానికి భారీ స్పందన
- రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతులు వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళలు, రైతులు, విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. రైతుల నిరసనకు వైద్యులు మద్దతుగా నిలిచారు.
11:34 December 22
సచివాలయ ముట్టడికి విద్యార్థుల యత్నం
- మందడం వై జంక్షన్ వద్ద సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సచివాలయం వెళ్లే మార్గానికి పోలీసులు ముళ్లకంచె వేశారు. విద్యార్థులు రహదారిపైనే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు.
10:18 December 22
వెలగపూడిలో రైతుల నిరాహార దీక్షలు
- అమరావతి ప్రాంతం వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. పిల్లలతో కలిసి రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతిని సాధిస్తామంటూ నినాదాలు చేస్తున్నారు.
09:36 December 22
విట్ విద్యార్థుల మద్దతు
- మందడంలో రైతుల ధర్నాకు విట్ విద్యార్థులు మద్దతు తెలిపారు. తమ ఉన్నత భవిష్యత్ కోసమే రైతులు త్యాగాలు చేశారనీ.. ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకు రైతులకు మద్దతుగా పోరాడతామని స్పష్టంచేశారు.
09:01 December 22
ఉద్ధండరాయునిపాలెంలో వంటా వార్పు
- రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతులు వంటావార్పు చేస్తున్నారు. మెడలో చెప్పుల దండలు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
08:46 December 22
రహదారిపై పడవ పెట్టి రైతుల నిరసన
మందడంలో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. రహదారిపై పడవ పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
08:26 December 22
రాజధాని గ్రామాల్లో అంతకంతకూ తీవ్రమవుతున్న రైతుల ఆందోళనలు
- మూడు రాజధానుల నిర్ణయంపై ఆందోళనలు మిన్నంటాయి. 4 ప్రాంతాల్లో 29 గ్రామాల రైతులు నిరసనల్లో పాల్గొననున్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో నేడు వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు.
- మంగళగిరి మండలంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం, నవులూరు, ఎర్రబాలెంలోనూ రైతులు నిరసనలు చేస్తున్నారు. కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నవులూరు, ఎర్రబాలెంలో రాస్తారోకోలో రైతులు పాల్గొననున్నారు.