'మండలి రద్దు'పై మండిపడ్డ రాజధాని రైతులు - ఏపీ మండలి రద్దు న్యూస్
శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని.... తుళ్లూరు రైతులు ఖండించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందవనే ఉద్దేశంతోనే.... శాసనమండలి రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రైతులు, మహిళలు మండిపడ్డారు. ప్రజల బాధలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నపుడు... అలాంటి ప్రజాప్రతినిధులను వద్దనుకునే హక్కును కూడా తమకు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.