ETV Bharat / city

అమరావతిలోనే రాజధానిని ఉంచండి... అఖిలపక్ష భేటీలో నేతలు - all party meeting held under TDP on capital issue at amaravathi news

అమరావతిలోనే రాజధాని ఉండాలని గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో నేతలు డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షకు అన్ని విధాలా అండగా ఉండాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులు కూడా ఉద్యమంలో కలిసిరావాలని కోరారు.

all party meeting held under TDP on capital issue at amaravathi

author img

By

Published : Dec 24, 2019, 5:19 PM IST

మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చేందుకు... గుంటూరులో అఖిలపక్ష సమావేశం జరిగింది. గుంటూరులోని వైన్ డీలర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో తెదేపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, ఆప్ పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తాడికొండ మాజీఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అమరావతి ఎంపిక, భూసమీకరణ, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం, అక్కడ జరగబోయే అభివృద్ధి వంటి అంశాలను వివరించారు.

అమరావతిలోనే రాజధానిని ఉంచండి..అఖిలపక్ష భేటీలో నేతలు

రాజధానిని ఇక్కడే కొనసాగించటం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 26వ తేదిన గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాకు చెందిన మంత్రులు మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరితకు వినతిపత్రాలు అందజేయనున్నారు. జీఎన్ రావు కమిటి నివేదికను అఖిలపక్షం తిరస్కరిస్తూ... తీర్మానం చేసింది.

మంత్రివర్గ నిర్ణయం తర్వాత కార్యాచరణ..
రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప... రాజకీయపరంగా కాదని నేతలు పేర్కొన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి రైతుల పక్షాన నిలవాలని కోరారు. ఈనెల 27న మంత్రివర్గ సమావేశం నిర్ణయాన్ని బట్టి మళ్లీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని శ్రావణ్ కుమార్ తెలిపారు. అమరావతి కోసం చేసే ఆందోళనల్ని కలిసికట్టుగా నిర్వహించాలని ఈ నిర్ణయించారు.

ఇదీ చదవండి : రాజధానిపై పోరు - రాష్ట్రంలో నిరసనల హోరు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.