ఇదీ చదవండి :
'సీఎం జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి' - ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ ధరల పెంపు
ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో సామాన్యుడిపై భారం మోపిందని తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ తన పాదయాత్రలో.. ప్రజలపై పైసా భారం వేయనని హామీ ఇచ్చి.. ఆరు నెలలు తిరగకముందే ఛార్జీల మోత మోగించారని విమర్శించారు.
'సీఎం జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి'
సామాన్యుడిపై భారం మోపడమే వైకాపా ధ్యేయంగా పెట్టుకుందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా.. పేదల వ్యతిరేక ప్రభుత్వమని.. అందుకే ఆర్టీసీ ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల ఛార్జీలు కి.మీకు 10 పైసలు, మిగిలిన వాటిపై కి.మీకు 20 పైసలు పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఛార్జీల పెంపు సీఎం ఆమోదించారని మంత్రి పేర్ని నాని చెప్పడం ప్రజలను వంచించడమేనని ఆక్షేపించారు. ప్రజలపై పైసా భారం వేయనన్న జగన్... ఆరు నెలలు తీరగక ముందే ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను మోసగించారన్నారు. సీఎం జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం వైకాపా చేతగానితనానికి నిదర్శనమన్నారు. తెదేపా 5ఏళ్ల పాలనలో పేదలపై భారం మోపలేదని గుర్తుచేశారు. వైకాపా పాలనలో పవర్ ఉండదు కాని పవర్ ఛార్జీలు పెంచుతారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :
sample description
Last Updated : Dec 7, 2019, 11:43 PM IST