రెండు నెలలుగా ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ బహిరంగ మార్కెట్లో కిలో వంద రూపాయలకు చేరువయ్యాయి. రైతు బజార్లలో చిన్నవే రూ.40 నుంచి రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యమైన ఉల్లి ధర ఎక్కువ కావడం వల్ల వినియోగదారులు నాసిరకం సరుకునే కొనుక్కుంటున్నారు.
గంటల్లోనే ఖతం...
ఉల్లి ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం కిలో రూ.25 చొప్పున రైతు బజార్లలో పంపిణీ చేస్తోంది. వారం నుంచి విక్రయాలు మొదలయ్యాయి. వారంలో రెండు, మూడు రోజులపాటే విక్రయాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాకు 2 రోజులకొకసారి సరకును పంపిస్తున్నారు. అవి కూడా గంటల్లోనే అయిపోతున్నాయి.
వినియోగదారుల బారులు
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాయితీపై అందించే ఉల్లి కొనుగోలుకు శనివారం వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రెండు, మూడు రోజుల కిందటి వరకూ రాష్ట్రంలోనే పలు ప్రధాన పట్టణాల్లో కిలో రూ. 80 నుంచి రూ.90 ఉంది. ఇప్పుడు అక్కడా రూ. వంద చొప్పున అమ్ముతున్నారు. ఖరీఫ్‌లో మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాష్ట్రంలోనూ ఉల్లి విస్తీర్ణం, దిగుబడులు తగ్గాయి. భారీ వర్షాలకు నష్టం పెరిగింది. శుక్రవారం కర్నూలు మార్కెట్లో రైతులు గరిష్ఠంగా క్వింటాలుకు రూ.7వేలకు పైగా లభించింది.
ఇవీ చూడండి: