అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ బ్యాంకుపై విరుచుకుపడ్డారు. చైనాకు రుణాలు ఇవ్వడం మానేయాలని ట్వీట్ చేశారు.
'ప్రపంచ బ్యాంకు చైనాకు అప్పులు ఎందుకు ఇస్తోంది? ఇది సాధ్యమేనా..? చైనా దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. ఒకవేళ లేకపోతే వారు ఎలాగోలా సృష్టించుకుంటారు. కనుక వారికి డబ్బులు ఇవ్వడం ఆపండి!' - ట్రంప్ ట్వీట్
ట్రంప్ చేసిన ట్వీట్‌పై అమెరికా ట్రెజరీశాఖ మంత్రి స్టీవెన్ మునుచిన్ స్పందించారు. ప్రపంచ బ్యాంకు ఏళ్లుగా చైనాకు ఇస్తోన్న రుణాలు, ప్రాజెక్టులపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:తెలంగాణ పోలీసులకు ఒడిశాలో 'సైకత' సలాం!