ప్రస్తుత డిజిటల్ యుగంలో పాస్వర్డ్లు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ-మెయిల్, నెట్ బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాలు ఇలా అన్ని ఖాతాలకు పాస్వర్డ్లు తప్పనిసరి. వీటిల్లో ఖాతాదారులకు సంబంధించిన విలువైన సమాచారం ఉంటుంది. అందుకే పాస్వర్డ్లు ఎంత కఠినంగా ఉంటే డేటా అంత సురక్షితంగా ఉన్నట్లు లెక్క.
అయితే.. ఇంకా చాలా మందికి పాస్‌వర్డ్‌ల ఆవశ్యకత తెలీదనే విషయాన్ని ఓ ప్రముఖ సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడంలో పెద్దగా మార్పు రాలేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. స్ప్లాష్‌డేటా అనే సాఫ్ట్వేర్ సంస్థ విడుదల చేసిన.. 2019 ఏడాది.. 10 చెత్త పాస్‌వర్డ్‌ల జాబితా చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది.
2019- 10 చెత్త పాస్వర్డ్లు ఇవే..
1.123456
2.123456789
3.qwerty
4.password
5.1234567
6.12345
7.iloveyou
8.111111
10.123123
వీటిని కనుగొనేందుకు హ్యాకర్లే అవసరం లేదు..
ఈ పాస్‌వర్డ్‌లన్నీ చిన్నపిల్లలు, ఏ మాత్రం హ్యాకింగ్ గురించి తెలియని వారూ కనిపెట్టేంత సులభంగా ఉన్నాయి. అయితే మీరూ ఇలాంటి సులభతరమైన పాస్వర్డ్లు పెట్టుకుంటే.. ఇప్పుడే మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కఠినంగా పాస్వర్డ్లు పెట్టుకుంటే.. అందులో ఇంగ్లీష్‌లో పెద్ద, చిన్న అక్షరాలు, నంబర్లు, చిహ్నాలు ఉండాలని సూచిస్తున్నారు.
పాస్వర్డ్లు మర్చిపోతున్నారా?
కఠినంగా పాస్వర్డ్ పెట్టుకుంటే గుర్తుండదు అని చాలా మంది అంటుంటారు. అయితే సులభతరమైన పాస్‌వర్డ్‌ల వల్ల మీ విలువైన సమాచారం హ్యాకర్లకు ఇవ్వడం కన్నా ఇదే కాస్త ఉత్తమమని చెప్పాలి. రకరకాల అవసరాలకు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టి గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్లు 'పాస్వర్డ్ మేనేజర్'ను వాడటం ఉత్తమం.
అయితే ఇప్పటికే మీరు సులభంగా పెట్టిన పాస్వర్డ్ ద్వారా మీ ఈ-మెయిల్ హ్యాకర్ల చేతికి వెళ్లిందా లేదా అనే విషయాన్ని haveibeenpwned.com ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు.
ఇదీ చూడండి: కఠినమైన పాస్వర్డ్లు ఎలా ఉండాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి