హోంమంత్రి మేకతోటి సుచరితతో ముఖాముఖి సీఎం జగన్ మంత్రివర్గంలో కీలకమైన హోంమంత్రి పదవి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పొందారు. మంత్రులకు శాఖలకు కేటాయింపులో సీఎం జగన్...సామాజిక సమీకరణాలు పాటించారు. వైకాపా ఎన్నికల హామీలకు అనుగుణంగా ఎస్సీ వర్గానికి చెందిన సుచరితకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలతో పాటు మహిళల రక్షణ ప్రాధాన్యంగా విధులు నిర్వహిస్తానని ఆమె తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం జగన్ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానంటున్న సుచరితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.