సీఎస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ నెల 14న నిర్వహించనున్న మంత్రిమండలి అజెండాలోని అంశాలపై చర్చించింది. ఫొని తుపాను సహాయక చర్యలు, తాగునీటి ఎద్దడి, కరవు, వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ అమలుపై నిర్ణయించిన అజెండాను.. ఈసీకి పంపనున్నారు. భేటీకి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి, విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి వరప్రసాద్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ , పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ లు హాజరయ్యారు.
ఇవీ చూడండి-మే 23 న ఇండియన్ టైగర్ గా దీదీ: సీఎం