ETV Bharat / briefs

సీఎం నివాసం వద్ద భద్రత మరింత పటిష్టం - cm-badratha

సీఎం నివాసం వద్ద ఈ సాయంత్రం నుంచి భద్రత మరింత పటిష్టం చేయనున్నారు. నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2 కంపెనీల ఏపీఎస్‌పీ బలగాలు, 50 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటుచేస్తున్నారు.

babu
author img

By

Published : May 22, 2019, 2:50 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఈ సాయంత్రం నుంచి భద్రత మరింత పటిష్టం కానుంది. ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని చుట్టుపక్కల జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు సీఎం నివాసానికి పెద్దఎత్తున చేరుకొనే అవకాశం ఉన్నందున భద్రత పెంచారు. అదనపు బలగాలు ఇప్పటికే సీఎం నివాసం వద్దకు చేరుకుంటున్నాయి. 2 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు సహా... 50 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఈ సాయంత్రం నుంచి భద్రత మరింత పటిష్టం కానుంది. ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని చుట్టుపక్కల జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు సీఎం నివాసానికి పెద్దఎత్తున చేరుకొనే అవకాశం ఉన్నందున భద్రత పెంచారు. అదనపు బలగాలు ఇప్పటికే సీఎం నివాసం వద్దకు చేరుకుంటున్నాయి. 2 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు సహా... 50 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు.

Intro:ap_rjy_96_22_deputy cm chinarajappa_patispate_yagam_av_c17
రాష్ట్రంలో తెదేపా విజయం సాధించాలని, మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్నగర్ లోని
సంకట హర వరసిద్ధి విగ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం లక్ష్మీ గణపతి సహిత సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప హాజరై స్వామివారిని దర్శించుకుని యాగం లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా విజయాన్ని , అలాగే లోక కల్యాణం కోసం గన్ని కృష్ణ యాగం నిర్వహించారన్నారు . తెదేపా విజయం సాధించడం ఖాయమని 110 ఎమ్మెల్యే సీట్లు 20 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మోడీ ,కేసీఆర్ ,జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రజలు దృష్టిలో ఉంచుకొని తెదేపాకు మద్దతుగా నిలిచారన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించి తెదేపా కి వ్యతిరేకంగా పని చేసిందన్నారు. ఎటువంటి సర్వేలను నమ్మే పరిస్థితి లేదని తెదేపా సర్వేలు ఉన్నాయని తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి భవాని , తెదేపా నాయకులు వాసు, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498

For All Latest Updates

TAGGED:

cm-badratha
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.