కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆకస్మత్తుగా వర్షం పడింది. దీనిని అదునుగా తీసుకున్న ఆయన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వర్షంలో తడిసిన వారికి రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ఛలోక్తులు విసిరారు.
ముంబయిలోని విలేపార్లే ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు గడ్కరీ. పైకప్పు లేని వేదికపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వర్షం ప్రారంభమైంది. వెంటనే ఇద్దరు వ్యక్తులు గడ్కరీకి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి గొడుగులు పట్టుకున్నారు.
ఈ సందర్భంగా " వర్షంలో తడిచినప్పుడే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని పాత్రికేయులు అంటున్నారు" అని చమత్కరించారు. ఈ మాటలు అక్కడి వారిలో నవ్వులు పూయించాయి. తను వేసిన జోక్‌కు తనే పెద్దగా నవ్వారు గడ్కరీ.
-
पार्ले कट्टा कार्यक्रमातून लाइव https://t.co/ItVOEwUmzm
— Nitin Gadkari (@nitin_gadkari) November 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">पार्ले कट्टा कार्यक्रमातून लाइव https://t.co/ItVOEwUmzm
— Nitin Gadkari (@nitin_gadkari) November 1, 2019पार्ले कट्टा कार्यक्रमातून लाइव https://t.co/ItVOEwUmzm
— Nitin Gadkari (@nitin_gadkari) November 1, 2019
ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో సతార ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వర్షంలో తడవటాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు గడ్కరీ.
బలమైన సందేశం..
పవార్ వర్షంలో తడిసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో పార్టీ కార్యకర్తల్లో జీవం పోసింది. దీని ద్వారా బలమైన సందేశం అందించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. సతారా నుంచి పోటీ చేసిన ఎన్సీపీ అభ్యర్థి.. భాజపా ప్రత్యర్థి ఉదయరంజే భోస్లేపై విజయం సాధించారు.
2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్సీపీ పుంజుకుంది. గతంలో 13 సీట్లకే పరిమితమైన పవార్ పార్టీ ఈసారి ఏకంగా 53 సీట్లు సాధించింది.
ఇదీ చూడండి: త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్: శివన్